Breaking News

FIH Pro League: భారత హాకీ జట్లకు నిరాశ

Published on Tue, 02/25/2025 - 16:25

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్‌ తేడాతో నెదర్లాండ్స్‌ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ జట్టు చేతిలో ఓడిపోయాయి. 

నెదర్లాండ్స్‌తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్‌కీపర్‌ సవితా పూనియా తన కెరీర్‌లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్‌గా సవిత గుర్తింపు పొందింది.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేసింది. నెదర్లాండ్స్‌ తరఫున ఎమ్మా రెజ్నెన్‌ (7వ నిమిషంలో), ఫే వాన్‌డెర్‌ (40వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించగా... ఫెలిస్‌ అల్బెర్స్‌ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేసింది.

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టుకు అభిషేక్‌ (18వ నిమిషంలో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (39వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఇంగ్లండ్‌ తరఫున జేకబ్‌ పేటన్‌ (15వ నిమిషంలో) ఒక గోల్‌ చేయగా... సామ్‌ వార్డ్‌ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్‌ సాధించాడు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)