Breaking News

ప్రొ లీగ్‌తో భారత హాకీ జట్ల ఆట షురూ

Published on Fri, 01/17/2025 - 05:57

భువనేశ్వర్‌: భారత హాకీ జట్లు ఈ సీజన్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌తో ప్రారంభించనున్నాయి. భారత్‌ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్‌తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ‘ఢీ’ కొట్టనుంది. 

ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్‌ ఆరంభం కానుంది. 

వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్‌ అంచె ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్‌లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్‌లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. 

భారత్‌ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్‌ఐహెచ్‌ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్‌ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్‌ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్‌ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్‌లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.

11 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్‌ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తవడంతో ఫైనల్స్‌కు చేరే నాకౌట్‌ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్‌ మహిళల జట్టు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ టైటిల్స్‌ నెగ్గాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)