Breaking News

ఫ్రాంచైజ్ లీగ్ టోర్నమెంట్‌లో గోవా చాలెంజర్స్‌ శుభారంభం

Published on Fri, 08/23/2024 - 13:03

చెన్నై: ఫ్రాంచైజీ లీగ్‌ టోర్నీ అల్టిమేట్ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) ఐదో సీజన్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు డిఫెండింగ్‌ చాంపియన్‌ గోవా చాలెంజర్స్‌ శుభారంభం చేసింది. చాలెంజర్స్‌ 9–6 పాయింట్ల తేడాతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జైపూర్‌ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 1–2 తేడాతో చో సుంగ్‌ మిన్‌ చేతిలో ఓడగా... మహిళల సింగిల్స్‌లో ల్యూ యాంగ్‌ జి 3–0తో సుతాసిని సవేతాత్‌ను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హర్మీత్‌–ల్యూ ద్వయం 2–1తో రోనిత్‌ భాంజా–సుతాసినిలపై గెలుపొందింది. రెండో పురుషుల సింగిల్స్‌లో మిహాయి బొబొసికా 2–1తో రోనిత్‌ భాంజాను ఓడించగా... రెండో మహిళల సింగిల్స్‌లో నిత్యశ్రీ మణి 2–1తో యశస్విని ఘోర్పడేపై విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మూడు మ్యాచ్‌లు నెగ్గిన గోవా ఖాతాలో 9 పాయింట్లు చేరగా... రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పేట్రియాట్స్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. అంతకుముందు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ లీగ్‌ను ప్రారంభించారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)