మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
FIFA WC: వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఘట్టం.. ఆ మహిళామణులు ఎవరంటే!
Published on Sat, 12/03/2022 - 10:45
FIFA World Cup 2022 Germany Vs Costa Rica: తొలిసారి మహిళా రిఫరీలు వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు ముగ్గురు మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం విశేషం. పురుషుల ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి. కాగా... స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్) ఫీల్డ్ రిఫరీగా, న్యూజా బ్యాక్ (బ్రెజిల్), కరెన్ డియాజ్ (మెక్సికో) అసిస్టెంట్ రిఫరీలుగా ఈ ఘనతలో భాగమయ్యారు.
తదుపరి మ్యాచ్‌ల్లో సలీమా ముకన్‌సంగా (రువాండా), యోషిమి యామషిటా (జపాన్) కూడా ఫీల్డ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. 38 ఏళ్ల స్టెఫానీ 2019లో లివర్‌పూల్, చెల్సీ జట్ల మధ్య యూరోపియన్ కప్ పురుషుల సూపర్ కప్ ఫైనల్లో, 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో, గత సీజన్‌లో ఫ్రెంచ్ కప్ ఫైనల్లోనూ రిఫరీగా వ్యవహరించింది.
చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్
Tags : 1