Breaking News

చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రిక్వార్టర్స్‌కు పోర్చుగల్‌

Published on Fri, 07/03/2026 - 09:01

పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రొనాల్డో 41 ఏళ్ల 147 రోజుల వయసులోఈ ఘనత సాధించాడు.

తద్వారా ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో 40 ఏళ్ల వయసు తర్వాత గోల్‌ కొట్టిన ఫుట్‌బాలర్‌గానూ రొనాల్డో చరిత్రకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్‌-2026లో భాగంగా క్రొయేషియాతో జరిగిన రౌండ్‌32 మ్యాచ్‌ సందర్భంగా ఈ పోర్చుగల్‌ దిగ్గజం ఈ ఘనత సాధించాడు.

అంతకుముందు ఈ రికార్డు పోర్చుగల్‌కే చెందిన పెపె పేరిట ఉండేది. 2022లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 39 ఏళ్ల 283 రోజుల వయసులో పెపె గోల్‌ కొట్టాడు. రొనాల్డో ఇప్పుడు అతడిని అధిగమించాడు.

ప్రిక్వార్టర్స్‌కు పోర్చుగల్‌
టొరొంటో వేదికగా పోర్చుగల్‌- క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్‌ రెండో అర్దభాగంలో... ఇవాన్‌ పెరిసిక్‌ 53వ నిమిషంలో గోల్‌ కొట్టడంలో క్రొయేషియా ఖాతా తెరిచింది.

ఈ క్రమంలో పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక అదనపు సమయంలో (90+4) రామోస్‌ గోల్‌ కొట్టి పోర్చుగల్‌ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అయితే, 103వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు జోస్కో గవార్డియాల్‌ గోల్‌ కొట్టగా.. సమీక్ష తర్వాత వీడియో అసిస్టెంట్‌ రిఫరీ(VAR) మాత్రం దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు.

దీంతో క్రొయేషియా నిరాశలో మునిగిపోగా.. పోర్చుగల్‌ 2-1తో జయభేరి మోగించి.. రౌండ్‌ 16కు దూసుకవెళ్లింది. కాగా ఆటగాడు బాల్‌ను అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్‌ కంటే ముందు ఉండి.. తద్వారా ఆటలో ప్రభావం చూపినట్లయితే దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. ఆ సమయంలో సదరు ఆటగాడు గోల్‌ కొట్టినా అది చెల్లదు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)