Breaking News

మెస్సీ, రొనాల్డోలకు ఊహించని షాక్‌..

Published on Tue, 09/13/2022 - 12:18

ప్రస్తుత తరం ఫుట్‌బాల్‌ స్టార్లుగా వెలుగొందుతున్న లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఊహించని షాక్‌ తగిలింది. సోమవారం ప్రకటించిన ఫిఫా 23 అల్టిమేట్‌ టీమ్‌ పేరిట  అత్యధిక రేటింగ్‌ కలిగిన స్టార్‌ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు.  ఈ జాబితాలో ఎప్పుడు టాప్‌లో ఉండే మెస్సీ, రొనాల్డోలు తొలిసారి కిందకు పడిపోయారు. మెస్సీ ఐదో స్థానంలో ఉండగా.. రొనాల్డో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.  

23 మందితో ప్రకటించిన ఈ జాబితాలో అగ్రభాగం ఇంగ్లండ్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఆడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. 23 మందిలో 11 మంది ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌కు చెందిన వారు కాగా.. మిగతా 12 మంది వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడుతున్నారు.  ఇక తొలి ఐదు స్థానాల​కు 91 రేటింగ్‌ పాయింట్లే ఇచ్చినప్పటికి  ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ ప్రకటించారు.

రియల్‌ మాడ్రిడ్‌కు చెందిన కరీమ్‌ బెంజెమా 91 రేటింగ్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా..  బార్సిలోనాకు చెందిన రాబర్ట్‌ లెవాన్‌డోస్కీ(91 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానంలో.. పారిస్‌ సెయింట్‌ జర్మన్‌(పీఎస్‌జీ)కు చెందిన కైలియన్‌ మేపీ(91 రేటింగ్‌) మూడో స్థానంలో.. మాంచెస్టర్‌ సిటీకి చెందని కెవిన్‌ డిబ్రూయోన్‌(91 రేటింగ్‌) నాలుగో స్థానంలో.. పీఎస్‌జీకి చెందిన లియోనల్‌ మెస్సీ(91 రేటింగ్‌) ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 90 రేటింగ్‌తో మహ్మద్‌ సాలా(లివర్‌పూల్‌), వర్జిల్‌ వాన్‌ డిజ్క్‌(లివర్‌ పూల్‌), క్రిస్టియానో రొనాల్డో(మాంచెస్టర్‌ యునైటెడ్‌) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక రేటింగ్‌ కలిగిన 23 స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌
కరీమ్ బెంజెమా (రియల్ మాడ్రిడ్) - 91 రేటింగ్
రాబర్ట్ లెవాండోస్కీ (బార్సిలోనా) - 91 రేటింగ్
కైలియన్ మేపీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్
కెవిన్ డి బ్రూయ్నే (మాంచెస్టర్ సిటీ) - 91 రేటింగ్
లియోనెల్ మెస్సీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్
మొహమ్మద్ సలా (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది
వర్జిల్ వాన్ డిజ్క్ (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది
క్రిస్టియానో రొనాల్డో (మాంచెస్టర్ యునైటెడ్) - 90 రేటింగ్
తిబౌట్ కోర్టోయిస్ (రియల్ మాడ్రిడ్) - 90 రేటింగ్
మాన్యుయెల్ న్యూయర్ (బేయర్న్ మ్యూనిచ్) - 90 రేట్ చేయబడింది
నేమార్ జూనియర్ (పారిస్ సెయింట్-జర్మైన్) - 89 రేటింగ్
హ్యూంగ్-మిన్ సన్ (టోటెన్‌హామ్ హాట్స్‌పుర్) - 89 రేట్ చేయబడింది
సాడియో మనే (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది
జాషువా కిమ్మిచ్ (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది
కాసెమిరో (మాంచెస్టర్ యునైటెడ్) - 89 రేటింగ్
అలిసన్ (లివర్‌పూల్) - 89 రేట్ చేయబడింది
హ్యారీ కేన్ (టోటెన్‌హామ్ హాట్స్‌పుర్) - 89 రేట్ చేయబడింది
ఎడెర్సన్ (మాంచెస్టర్ సిటీ) - 89 రేటింగ్
గోలో కాంటే (చెల్సియా) - 89 రేటింగ్
జాన్ ఓబ్లాక్ (అట్లెటికో మాడ్రిడ్) - 89 రేట్ చేయబడింది
ఎర్లింగ్ హాలాండ్ (మాంచెస్టర్ సిటీ) - 88 రేటింగ్
టోని క్రూస్ (రియల్ మాడ్రిడ్) - 88 రేటింగ్
మార్క్వినోస్ (పారిస్-సెయింట్ జర్మైన్) - 88 రేటింగ్‌

చదవండి: Ishwar Pandey: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)