Breaking News

విజేత తేలేది టైబ్రేక్‌లోనే...

Published on Wed, 11/26/2025 - 10:28

పనాజీ: పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. సిందరోవ్‌ జవోఖిర్‌ (ఉజ్బెకిస్తాన్‌), వె యి (చైనా) మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లోని నిర్ణీత రెండు క్లాసిక్‌ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నేడు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. సిందరోవ్, వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అంతకుముందు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) ముఖ్య అతిథిగా విచ్చేసి రెండో గేమ్‌ను ప్రారంభించింది.  

టైబ్రేక్‌ జరిగేది ఇలా... 
సిందరోవ్, వె యి మధ్య నేడు ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫలితం తేలకపోతే 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా ఫలితం రాకపోతే 5 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను నిర్వహిస్తారు. అయినా విజేత తేలకపోతే 3 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా స్కోరు సమమైతే ఇద్దరి మధ్య ‘సడన్‌ డెత్‌’ గేమ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ ‘సడెన్‌ డెత్‌’ గేమ్‌ కూడా ‘డ్రా’ అయితే నల్లపావులతో ఆడిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు.  

మరోవైపు రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఆండ్రీ ఎసిపెంకో (Andrey Esipenko) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నొదిర్‌బెక్‌ యాకుబొయేవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన పోటీలో ఎసిపెంకో 2–0తో గెలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత సాధించాడు. నొదిర్‌బెక్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచిన ఎసిపెంకో... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 26 ఎత్తుల్లో విజయం సాధించాడు. 

చ‌ద‌వండి: ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌- పాకిస్థాన్ టి20 మ్యాచ్‌

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)