Breaking News

కోనేరు హంపితో ప్రియాంక పోటీ! ముగిసిన హర్ష భరతకోటి కథ..

Published on Wed, 08/02/2023 - 08:07

బకూ (అజర్‌బైజాన్‌): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రియాంక ర్యాపిడ్‌ ఫార్మాట్‌ టైబ్రేక్‌లో 1.5–0.5తో గెలుపొందింది.

టైబ్రేక్‌ తొలి గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్‌లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్‌గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్‌ గేమ్‌లను నిర్వహించారు.

రెండో రౌండ్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్‌ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. లెవాన్‌ పాంట్‌సులెయ (జార్జియా)తో టైబ్రేక్‌ తొలి గేమ్‌లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్‌ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)