Breaking News

వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఎవరిదో తెలుసా?

Published on Wed, 10/04/2023 - 11:05

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.

తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన టాప్‌-5 ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం.

కెవిన్‌ ఓబ్రియన్‌..
వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్‌ ఓబ్రియన్‌ పేరిట ఉంది. భారత్‌ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఓబ్రియన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు.

6వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఓబ్రియన్‌ బౌండరీల వర్షం కరిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్‌ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌ ప్రపంచకప్‌ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోనుంది.

గ్లెన్‌ మాక్స్‌వెల్
ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఓబ్రియన్‌ తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఉన్నాడు. సొంతగడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.

ఏబీ డివిలియర్స్‌
ఇక లిస్ట్‌లో మాక్స్‌వెల్‌ తర్వాత ఈ లిస్ట్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్‌లతో 162 పరుగులు చేశాడు.

ఇయాన్‌ మోర్గాన్‌ 
ఇక ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నాలుగో స్ధానంలో ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్‌ 57 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 71 బంతులు ఆడిన మోర్గాన్‌ 4 ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు.

మాథ్యూ హేడన్‌
ఇక​ ఈ జాబితాలో ఐదు స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం మాథ్యూ హేడన్‌ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో హేడన్‌.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్ని సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడన్‌ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు.
చదవండిAsian Games 2023: శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)