భారత మాజీ వికెట్‌ కీపర్‌కు అరుదైన గౌరవం..

Published on Thu, 07/24/2025 - 07:26

మాంచెస్టర్‌: భారత మాజీ వికెట్‌ కీపర్, తమ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఫరూఖ్‌ ఇంజినీర్‌ను లాంకషైర్‌ కౌంటీ క్లబ్‌ సముచితంగా గౌరవించింది. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో ఒక స్టాండ్‌కు దిగ్గజం క్రికెటర్‌ క్లయివ్‌ లాయిడ్‌తో కలిపి ‘సర్‌ క్లయివ్‌ లాయిడ్‌ అండ్‌ ఫరూఖ్‌ ఇంజినీర్‌ స్టాండ్‌’ అని పేరు పెట్టింది.

నాలుగో టెస్టు ఆరంభానికి ముందు ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ముంబైకి చెందిన ఫరూఖ్‌ ఇంజినీర్‌ 1961–1975 మధ్య భారత్‌ తరఫున 46 టెస్టులు ఆడి 2611 పరుగులు చేయడంతో పాటు కీపర్‌గా 82 వికెట్ల పతనంలో భాగస్వామిగా ఉన్నారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో చాలా భాగం ఇంగ్లండ్‌ కౌంటీ లాంకషైర్‌నే తన సొంత జట్టుగా చేసుకున్న ఫరూఖ్‌... లాంకషైర్‌ తరఫున 175 మ్యాచ్‌లలో 5942 పరుగులు సాధించి 429 క్యాచ్‌లు పట్టారు. విండీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లాయిడ్‌ లాంకషైర్‌ తరఫున 219 మ్యాచ్‌లలో 12,764 సాధించారు. 

వీరిద్దరు ప్రాతినిధ్యం వహించిన ఎనిమిదేళ్ల సమయంలో జట్టు వరుస విజయాలతో ఏడు ట్రోఫీలు గెలుచుకుంది. అందుకే వీరిద్దరిని గౌరవిస్తూ స్టాండ్‌కు పేరు పెట్టింది. సొంత దేశంలో లభించని గౌరవం తనకు ఇక్కడ లభించడం పట్ల ఫరూక్‌ ఇంజినీర్‌ సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: జెర‍్సీ నంబర్‌ 'ఏకే-47'

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)