Breaking News

RCB Vs CSK: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు..

Published on Tue, 04/18/2023 - 10:36

ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువ పేసర్‌ విజయ్‌కుమార్ వైషాక్.. తన రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌కుమార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌కుమార్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 62 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ తరపున అ‍త్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా వైషాక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సీఎస్‌కే చేతిలో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది.  227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8  వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.

ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(62), మాక్స్‌వెల్‌(76) విరోచిత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్‌కేనే వరించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్‌ దుబే(52) పరుగులతో దుమ్ము రేపారు.
చదవండి: IPL 2023: మరీ ఇంత బద్దకమా.. మొయిన్‌ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)