Breaking News

ఏంటి ప‌రాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్‌? వీడియో వైర‌ల్‌

Published on Mon, 03/31/2025 - 17:36

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ మ‌రోసారి నెటిజ‌న్ల అగ్ర‌హ‌నికి గురయ్యాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌పై అభిమానులు మండిప‌డుతున్నారు. ఎంద‌కంత యాటిట్యూడ్ అని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అస‌లేమి జ‌రిగిందంటే.. ఐపీఎల్‌-2025లో భాగంగా ఆదివారం గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి.

ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప‌రాగ్ ప‌ర్వ‌లేద‌న్పించాడు. తొలుత బ్యాటింగ్‌లో 37 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన ప‌రాగ్‌.. అనంత‌రం ఫీల్డింగ్‌లోనూ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. రాజ‌స్తాన్ విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. 

ఇక్క‌డ వ‌ర‌కు అంత‌బాగానే ఉన్నా.. మ్యాచ్ అనంతరం అత‌డు గ్రౌండ్ స్టాప్‌తో ప్ర‌వ‌ర్తించిన తీరు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. మ్యాచ్ ముగిశాక బ‌ర్సాప‌ర క్రికెట్ గ్రౌండ్‌ సిబ్బంది ప‌రాగ్ వ‌ద్ద‌కు వ‌చ్చి వచ్చి సెల్ఫీ అడిగారు. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం వచ్చి నిల్చొని పరాగ్ చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత.. వారివైపు కాస్త డిఫెరెంట్‌గా అత‌డు చూశాడు. 

సెల్పీ దిగిన అనంత‌రం వారి మొబైల్‌ను చేతికి ఇవ్వకుండా  విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ మెయింటేన్ చేసినందుకు రియాన్ ప‌రాగ్‌పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.

 

చ‌ద‌వండి: IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన బుమ్రా

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)