Breaking News

IPL 2021: టాస్‌ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరినట్టేనా!

Published on Fri, 10/08/2021 - 16:05

Mumbai Indians Need 171 Runs Win To Enter Playoffs.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి. ఒక మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా.. మరొక మ్యాచ్‌ మాత్రం కీలకంగా మారింది. అదే ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌. ఈ మ్యాచ్‌లో ముంబై 171 పరుగుల తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అలా కానీ పక్షంలో కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. దీంతో ముంబైకి టాస్‌ కీలకంగా మారనుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసి వీరబాదుడే లక్ష్యంగా పెట్టుకొని భారీ స్కోరు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను 171 పరుగుల తేడాతో ఓడిస్తే ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు అడుగుపెడుతుంది. ఇది దాదాపు అసాధ్యం.

కానీ ఇది టి20.. ఏ క్షణంలో ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. పైగా ముంబై ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌. అయితే టాస్‌ ఓడిపోతే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా బ్యాటింగ్‌ చేస్తుంది. అప్పుడు ముంబైకి ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉండదు. అందుకే ముంబై ఇండియన్స్‌ అభిమానులు మొదట టాస్‌ గెలవాలని.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఫన్నీవేలో ట్రోల్‌ చేశాడు. ముంబైకి టాస్‌ ప్రాణసంకటంగా మారిందని.. టాస్‌ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరినట్టే అంటూ బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ''అందాజ్‌ అప్నా అ‍ప్నా'' సినిమాలో అమీర్‌- సల్మాన్‌లు టాస్‌ వేస్తూ తంటాలు పడే సన్నివేశాన్ని షేర్‌ చేశాడు. ప్రస్తుతం జాఫర్‌ చేసిన ట్రోల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: MI Vs SRH: కేకేఆర్‌ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!

IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)