Breaking News

వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..

Published on Sat, 03/11/2023 - 09:16

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్‌ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. కామెరాన్‌ గ్రీన్‌ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలిసారి 400 పరుగులు మార్క్‌ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ ఆరు వికెట్లతో చెలరేగాడు.  ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది.

ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్‌లో సూర్యకుమార్‌ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్‌ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్‌.. షమీ.. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు.

ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్‌ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌తో పాటు మార్నస్‌ లబుషేన్‌ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ను ఔట్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71 ఓ‍వర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్‌

'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)