Breaking News

82 బంతుల్లో 9 పరుగులు.. సూపర్‌ ఇన్నింగ్స్‌! మరో పుజారా అంటూ

Published on Sat, 07/29/2023 - 11:25

లండన్‌ వేదికగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్‌ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్‌ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్‌ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం  మాత్రమే ఆసీస్‌కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

లబుషేన్‌పై ట్రోల్స్‌.. 
ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్ స్లో ఇన్నింగ్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్‌ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్‌.. ఆఖరికి వుడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

లుబషేన్‌ స్లో ఇన్నింగ్స్‌ కారణంగా ఆసీస్‌ రెండో రోజు తొలి సెషన్‌లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్‌ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్‌ పుజారా అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌కు వ్యతిరేకంగా లబుషేన్‌ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్‌ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 162 పరుగులు చేశాడు.
చదవండి: MLC 2023: జూనియర్‌ 'ఏబీడీ' సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌ టీ​మ్‌

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు