Breaking News

కోల్‌కతా కొత్త కెప్టెన్‌గా నితీష్‌ రాణా.. కేకేఆర్‌ తప్పు చేసిందా?

Published on Tue, 03/28/2023 - 13:56

ఐపీఎల్‌-2023 సీజన్‌కు గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ కెప్టెన్‌గా నితీష్ రానాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వెన్నుగాయంతో రెగ్యూలర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అత‌డి స్థానంలో కెప్టెన్‌గా నితీష్ రానాను కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ నియమించింది. కెప్టెన్సీ రేసులో రాణాతో పాటు సునీల్‌ నరైన్‌,శార్ధూల్‌ ఠాకూర్‌ పేర్లు వినిపించినప్పటకీ.. కేకేఆర్‌ మేనెజ్‌మెంట్‌ మాత్రం నితీష్‌ వైపు మెగ్గు చూపింది.

కాగా నితీశ్ రాణాకు  కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పట్ల కేకేఆర్‌ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జట్టులో షకీబుల్ హసన్, టిమ్ సౌథీ, నరైన్‌ వంటి అనుభవం ఉన్న క్రికెటర్లను పక్కన పెట్టి నితీశ్ రాణాను నియమించడం సరికాదని ​అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించే సామ‌ర్థ్యం, అనుభ‌వం నితీష్ రానాకు లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం రాణాకు మద్దతుగా నిలుస్తున్నారు.

అతడికి కెప్టెన్సీ పరంగా అనుభవం ఉందంటూ సపోర్ట్‌ చేస్తున్నారు. కాగా రాణాకు కెప్టెన్సీ ఏం కొత్త కాదు.  దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు రాణా సారథ్యం వహించాడు.  టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ తర్వాత ఢిల్లీ జట్టుకు రాణానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 12 మ్యాచులకు  కెప్టెన్సీ చేశాడు. అతడి సారథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)