గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. విరాట్‌ ఏం చేశాడంటే?

Published on Mon, 01/16/2023 - 07:29

తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్‌ మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ జరుగుతుండగా టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి  మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్‌ కాళ్లకు దండం పెట్టాడు.

వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక శ్రీలంకతో ఆఖరి వన్డేల్లో విరాట్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో సంచలన సెంచరీతో కోహ్లి చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.


చదవండి: IND vs SL: విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)