Breaking News

డుప్లెసిస్‌ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో

Published on Fri, 09/13/2024 - 10:41

కరేబియన్‌ ప్రీమియర్ లీగ్‌-2024లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్‌ వేదికగా సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్‌ కిట్స్‌ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్‌(62), రూసో హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. సెయింట్‌ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్‌, వీస్‌, సద్రక్‌ తలా వికెట్‌ సాధించారు.

డుప్లెసిస్‌ ఊచకోత..
అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్‌ లూసియా కింగ్స్‌ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్‌ డుప్లెసిస్‌, జాన్సెన్‌ చార్లెస్‌ విధ్వంస​ం సృష్టించారు. 

ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్‌ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్‌ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్‌సన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

కాగా డుప్లెసిస్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్‌ వారియర్స్‌ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్‌ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది.

 చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్‌- అఫ్గాన్ టెస్టు రద్దు

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు