Breaking News

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ వైస్‌ కెప్టెన్‌గా డుప్లెసిస్‌

Published on Mon, 03/17/2025 - 14:47

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఫాఫ్‌ డుప్లెసిస్‌ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్‌ను ఢిల్లీ ఈ సీజన్‌ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్‌ను బేస్‌ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. 

కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో ఫాఫ్‌ అక్షర్‌కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఫాఫ్‌కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్‌ కెప్టెన్సీ అనుభవం​ ఈ సీజన్‌లో అక్షర్‌ పటేల్‌కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. 

ఫాఫ్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడి 136.37 స్ట్రయిక్‌రేట్‌తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్‌ ఈ సీజన్‌లో ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్‌ యువ ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌తో ఫాఫ్‌ జోడీ కట్టవచ్చు. 

కాగా, ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ అక్షర్‌ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించకముందు ఈ సీజన్‌లోనే తమతో చేరిన కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్సీ కోసం​ సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ ఆఫర్‌ను రాహుల్‌ తిరస్కరించాడని సమాచారం. రాహుల్‌ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్‌లో రాహుల్‌, డుప్లెసిస్‌తో పాటు ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా ఢిల్లీతో జతకట్టాడు. 

ఈ సీజన్‌ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ స్టార్క్‌కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్‌ వరకు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ను ఈ సీజన్‌లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్‌ లక్నో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్‌ మార్చి 22న కేకేఆర్‌, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..
అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్, టి. నటరాజన్‌, విప్రాజ్‌ నిగమ్‌, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)