Breaking News

వరుస వైఫల్యాలు.. కరుణ్‌ నాయర్‌పై వేటు..? 

Published on Fri, 07/18/2025 - 09:22

లండన్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి జరగనుండగా అప్పుడే తుది జట్టుపై చర్చ మొదలైంది. సిరీస్‌లో జట్టు ఆడిన మూడు టెస్టులను చూస్తే బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ మినహా ఇతర ఆటగాళ్లంతా రాణించారు. నాయర్‌ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీజ్‌లోకి వచ్చాక మెరుగ్గానే ఇన్నింగ్స్‌లను ఆరంభించినా...వాటిని అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.

అతను వరుసగా 0, 20, 31, 26, 40, 14 (మొత్తం 131 పరుగులు) స్కోర్లు నమోదు చేశాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత తనకు లభించిన ‘మరో చాన్స్‌’ను నాయర్‌ సది్వనియోగం చేసుకోలేదు. ముఖ్యంగా లార్డ్స్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో నాయర్‌ స్థానం నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది.

కీలకమైన మూడో స్థానంలో నాయర్‌కు బదులుగా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు మరో అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లీడ్స్‌ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయినా... రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి షాట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన (30 పరుగులు) కనబర్చాడు. తుది జట్టుకు సంబంధించి ఈ ఒక్క మార్పు మాత్రం కచ్చితంగా ఉండవచ్చని తెలుస్తోంది.  

కాగా, 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ 2, భారత్‌ ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచాయి. సిరీస్‌లో నిలబడాలంటే భారత్‌ నాలుగో టెస్ట్‌లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులకు ఆస్కారం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు కరుణ్‌ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)