Breaking News

'టాటా, బై బై.. నీ ప‌ని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published on Wed, 09/25/2024 - 12:13

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు గ‌త రెండేళ్ల‌గా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన త‌ర్వాత పాక్ జ‌ట్టు చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతుంది. గ‌తేడాది జ‌రిగిన ఆసియాక‌ప్, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం ప‌ట్టింది.

దీంతో పాక్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టాప్‌ను మొత్తాన్ని పీసీబీ ప్రక్షాళన చేసింది. పాక్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్‌గా గ్యారీ కిర్‌స్టెన్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా.. రెడ్‌బాల్ కోచ్‌గా ఆసీస్ దిగ్గ‌జం గిల్లెస్పీ నియ‌మితుడ‌య్యాడు. అయితే కోచ్‌లు మారిన‌ప్ప‌ట‌కి పాక్ క్రికెట్ త‌లరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లోనూ పేల‌వ ఆట‌తీరుతో గ్రూపు స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్కమ్రించింది.

దీంతో హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై కూడా పీసీబీ వేటు వేస్తుంద‌ని ఆ మ‌ధ్య కాలంలో వార్త‌లు వినిపించాయి. కానీ పాక్ క్రికెట్ బోర్డు ఇప్ప‌టివ‌ర‌కు అయితే ఈ విష‌యంపై ఎటువంటి ఆధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాజాగా ఇదే విష‌యంపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ బాసిత్ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కిర్‌స్టెన్‌ను పాక్ హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని అలీ తెలిపాడు.

"గ్యారీ కిర్‌స్టన్‌కు అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా అత‌డు కొన‌సాగుతాడు.  అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడిని త‌ప్పించ‌నున్నారు. అందుకే ఇప్పుడే గ్యారీకి టాటా, బై బై చెప్పాల‌న‌కుంటున్నాను. ఈ మెగా టోర్నీలో పాక్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిస్తే చాలు అదే పెద్ద విజ‌యంగా భావిస్తాము. 

పాక్ క్రికెట్‌లో రాజకీయాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. క్రికెట్‌లో రాజ‌కీయ నాయ‌కులు జోక్యం చేసుకోవ‌డం అంత‌మంచిది కాదు అంటూ" బ‌సిత్ అలీ త‌న యూట్యాబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. కాగా పాక్ క్రికెట్ జ‌ట్టు ఆక్టోబ‌ర్ 7 నుంచి ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)