Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ భామ

Published on Fri, 07/18/2025 - 09:59

మాంట్రియల్‌: కెనడా టెన్నిస్‌ స్టార్‌ జెనీ బుచార్డ్‌ తన కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. మాంట్రియల్‌ ఓపెన్‌ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌కు ముందు సన్నాహక టోర్నీగా నిర్వహించే ‘నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌’ త్వరలో మాంట్రియల్‌లో జరుగుతుంది.

‘ప్రతీ దానికి టైమ్‌ ఉంటుంది. అలాగే నేను నిష్క్రమించే టైమ్‌ వచ్చి​ంది. ఎక్కడ కెరీర్‌ను మొదలు పెట్టానో అక్కడే టెన్నిస్‌ను ముగించబోతున్నాను’ అని సోషల్‌ మీడియాలో బుచార్డ్‌ పోస్ట్‌ చేసింది. కెరీర్‌లో 299 విజయాలు, 230 పరాజయాల రికార్డును కలిగిన బుచార్డ్‌ 2023లో కెనడా గెలిచిన బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో కీలకపాత్ర పోషించింది. 2014లో బుచార్డ్‌ సూపర్‌ ఫామ్‌ చాటుకుంది.

ఆ ఏడాది వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ కెనడా స్టార్‌ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో సెమీఫైనల్‌ దాకా పోరాడింది. తద్వారా కెరీర్‌ బెస్ట్‌ ఐదో ర్యాంక్‌కు ఎగబాకింది. అయితే మరుసటి ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లోనూ క్వార్టర్స్‌ చేరిన ఆమెకు యూఎస్‌ ఓపెన్‌ చేసిన గాయం కెరీర్‌ను దెబ్బతీసింది.

2015లో యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరిన ఆమె లాకర్‌ రూమ్‌ వద్ద జారిపడింది. దీంతో కన్‌కషన్‌కు గురైన ఆమె టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. దీనిపై యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆమె గాయపడిందని జ్యూరీ విచారణలో తేలింది.     

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)