Breaking News

సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌

Published on Wed, 02/12/2025 - 08:01

లుసానే (స్విట్జర్లాండ్‌): మొట్టమొదటి ఒలింపిక్స్‌ ఇ–స్పోర్ట్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్‌లో ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్‌ మెగా ఈవెంట్‌ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. 

అయితే 2027 నుంచి రెగ్యులర్‌గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్‌ ఇ–స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్‌లో ఇ–స్పోర్ట్స్‌ ప్రపంచకప్‌ జరిగింది. కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, ఫోర్ట్‌నైట్, స్ట్రీట్‌ ఫైటర్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. 

త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌ అజిజ్‌ బిన్‌ తుర్కీ అల్‌ ఫైజల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్‌ ఇ–స్పోర్ట్స్‌ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్‌ థామస్‌ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్‌ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్‌ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)