Breaking News

ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్‌ ఆటగాడు

Published on Mon, 04/07/2025 - 11:41

ఇంగ్లండ్‌ ఆటగాడు టామ్‌ బాంటన్‌ కౌంటీ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (సోమర్‌సెట్‌) 403 బంతులు ఎదుర్కొని 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 371 పరుగులు స్కోర్‌ చేశాడు. కౌంటీ క్రికెట్‌ చరిత్రలో ఇది ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. సోమర్‌సెట్‌ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. 344 పరుగుల వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన బాంటన్‌.. మరో 27 జోడించి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో బాంటన్‌ ఆట తీరు చూసి బ్రియాన్‌ లారా 501 పరుగుల రికార్డు బద్దలు కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 371 పరుగుల స్కోర్‌ వద్ద బాంటన్‌ను టామ్‌ హిన్లే ఔట్‌ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాంటన్‌.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఈ స్థానంలో బరిలోకి దిగి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదో స్థానంలో అత్యధిక స్కోర్‌ రికార్డు బిల్‌ పాన్స్‌ఫోర్డ్‌ పేరిట ఉంది. 

అతను 1922/23లో టస్మానియా 429 పరుగులు స్కోర్‌ చేశాడు. ఓవరాల్‌గా బాంటన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 21వ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు బ్రియాన్‌ లారా పేరిట పదిలంగా ఉంది. 1994 కౌంటీ సీజన్‌లో లారా వార్విక్‌షైర్‌కు ఆడుతూ డర్హమ్‌పై 501 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక​ వ్యక్తిగత స్కోర్‌ చేసిన రికార్డు నింబాల్కర్‌ పేరిట ఉంది. నింబాల్కర్‌ 1948లో ఖతియావార్‌పై 443 (నాటౌట్‌) పరుగులు స్కోర్‌ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో భారత్‌ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ పృథ్వీ షా పేరిట ఉంది. షా 2023 రంజీ సీజన్‌లో అసోంపై 379 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో పాటు టెస్ట్‌ల్లో కూడా అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు బ్రియాన్‌ లారా పేరిటే ఉంది. లారా 2004లో ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు (టాప్‌-10)
బ్రియాన్‌ లారా- 501 నాటౌట్‌
హనీఫ్‌ మొహమ్మద​్‌- 499
డాన్‌ బ్రాడ్‌మన్‌- 452 నాటౌట్‌
బీబీ నింబాల్కర్‌- 443 నాటౌట్‌
పాన్స్‌ఫోర్డ్‌- 437
పాన్స్‌ఫోర్డ్‌- 429
అప్తాబ్‌ బలోచ్‌- 428
మెక్‌లారెన్‌- 424
సామ్‌ నార్త్‌ఈస్ట్‌- 410 నాటౌట్‌
గ్రేమ్‌ హిక్‌- 405 నాటౌట్‌

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్సెస్టర్‌షైర్‌ 154 పరుగులకు ఆలౌటైంది. అల్‌డ్రిడ్జ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రోడ్రిక్‌ (58) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం​ బ్యాటింగ్‌కు దిగిన సోమర్‌సెట్‌.. టామ్‌ బాంటన్‌ ట్రిపుల్‌ సెంచరీతో (371) చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 670 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ ర్యూ (152) కూడా శతక్కొట్టాడు. భారీగా వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. సోమర్‌సెట్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు వార్సెస్టర్‌షైర్‌ ఇంకా 236 పరుగులు వెనుకపడి ఉంది. బ్రెట్‌ డొలివెయిరా (71), ఆడమ్‌ ఫించ్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు