ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. భారత జట్టులోకి పేస్‌ సంచలనం?

Published on Thu, 07/16/2026 - 04:58

కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ కార్డిఫ్ వన్డేలో టీమిం‍డియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

తొలి వన్డేలో గాయపడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికి.. పేసర్ గుర్నూర్ బ్రార్ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఎడ్జ్‌బాస్ట‌న్ వ‌న్డేలో గుర్నూర్ కాలి పిక్క గాయం బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే అత‌డు మైదానాన్ని వీడాడు. 

ఈ క్ర‌మంలో రెండో వ‌న్డేకు అత‌డికి విశ్రాంతి ఇచ్చి ప్రిన్స్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో టీ20ల్లో ప్రిన్స్‌ ఆకట్టుకున్నాడు. అంతకుముందు అఫ్గాన్‌తో సిరీస్‌లో కూడా అతడు రాణించాడు. వాస్తవానికి ఇంగ్లండ్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ప్రిన్స్‌కు చోటు దక్కలేదు. కానీ హర్షిత్‌ రాణా గాయపడడంతో సెలక్టర్లు ఈ ఢిల్లీ పేసర్‌కు తిరిగి పిలుపు నిచ్చారు.

మ‌రోవైపు ఇంగ్లండ్ కూడా ఓ మార్పు చేసే అవ‌కాశ‌ముంది. పేస‌ర్ జోష్ టంగ్ స్ధానంలో బ్రైడ‌న్ కార్స్‌కు అవ‌కాశ‌మివ్వ‌నున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మై ఓట‌మి చ‌విచూసింది.

తుది జ‌ట్లు(అంచనా)
భార‌త్‌
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్‌
జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్
 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)