Breaking News

బెన్‌ స్టోక్స్‌కు చేదు అనుభవం.. లగేజి మిస్సింగ్‌! స్పందించిన ఎయిర్‌లైన్స్‌

Published on Sat, 08/05/2023 - 11:13

ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌-2023 డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. లండన్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించడంతో సిరీస్‌ 2-2తో సమమైంది. చివరి టెస్టు అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వారి గమ్యస్ధానాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌  టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు చేదు అనుభవం ఎదురైంది.

అతడు లండన్‌ నుంచి డర్హామ్‌కు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణం చేశాడు. ఈ సందర్భంగా అతడి లగేజి బ్యాగ్‌లు కన్పించకుండా పోయాయి. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ.. ఇంతవరకు లగేజీ  అందించలేదని స్టోక్స్‌  ట్విటర్‌ వేదికగా తన ఆవేదనను తెలియజేశాడు.విమానంతో పాటు నా లగేజి రాలేదు.

నేను మీ సహాయం ​కోసం ఎదురుచూస్తున్నా అని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ను ట్యాగ్‌  చేస్తూ స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు. వెంటనే దానికి సదరు విమానయాన సంస్థ కూడా స్పందించింది. "హాయ్ బెన్, మీకు ఆసౌకర్యం కలిగినందుకు చింతుస్తున్నాం. మీ వివరాలను మాకు పంపించండి. మేము పరిశీలిస్తాము" అని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ రిప్లే ఇచ్చింది.

ఇక యాషెస్‌ తర్వాత స్టోక్స్‌ సుదీర్ఘ విరామం తీసుకోనున్నాడు. అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా స్టోక్స్‌ ఇప్పటికే వైట్‌బాల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో టీ20.. శుబ్‌మన్‌ గిల్‌పై వేటు! విధ్వంసకర ఓపెనర్‌ ఎంట్రీ

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)