Breaking News

టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జ‌ట్టు ప్ర‌కట‌న‌

Published on Wed, 07/09/2025 - 17:02

ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదిక‌గా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో లార్డ్స్ టెస్టు కోసం త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఇంగ్లండ్ బుధ‌వారం ప్ర‌క‌టించింది.

స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో క‌న్పించ‌నున్నాడు. యువ పేస‌ర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చ‌ర్‌ను తుది జ‌ట్టులోకి ఇంగ్లీష్ జ‌ట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా బెంచ్‌కే ప‌రిమితమ్యాడు.

ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్  సిద్ద‌మ‌య్యాడు. ఆర్చ‌ర్ చివ‌ర‌గా 2021లో ఇంగ్లండ్ త‌ర‌పున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మిన‌హా రెండో టెస్టులో ఆడినే జ‌ట్టును ఇంగ్లండ్ కొన‌సాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫ‌ల‌మైన ఓపెన‌ర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మ‌రో ఛాన్స్ ఇచ్చింది.

ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేట‌ర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు.  దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా‍ మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్ తుది జ‌ట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)