Breaking News

లార్డ్స్‌లో ఊచ‌కోత‌.. 8వ స్ధానంలో వ‌చ్చి విధ్వంసకర సెంచ‌రీ

Published on Fri, 08/30/2024 - 17:47

లార్డ్స్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్‌, యువ ఫాస్ట్ బౌల‌ర్ గస్ అట్కిన్సన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న బౌలింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించిన అట్కిన్స‌న్‌.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.

ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అట్కిన్స‌న్ శ్రీలంక బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 103 బంతుల్లోనే అట్కిన్స‌న్ త‌న తొలి సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.  ఓవ‌రాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్స‌న్‌.. 14 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 118 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

ఇక ఈ సెంచ‌రీతో అత‌డు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా ప‌లు అరుదైన రికార్డులను కూడా త‌న పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి సెంచ‌రీ చేసిన ఆరో ఆట‌గాడిగా అట్కిన్స‌న్ నిలిచాడు. 

లార్డ్స్‌లో 8వ స్ధానంలో వ‌చ్చి సెంచ‌రీలు చేసిన వారు వీరే
స్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్‌)
గుబ్బి అలెన్‌(122, ఇంగ్లండ్‌ )
బెర్నార్డ్ జూలియ‌న్‌( 121, వెస్టిండీస్‌)
గ‌స్ అట్కిన్స‌న్‌( 118, ఇంగ్లండ్‌)
రే ఇల్లింగ్ వ‌ర్త్‌(113, ఇంగ్లండ్‌)
అజిత్ అగార్క‌ర్‌(109, భార‌త్‌)

అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘ‌న‌త సాధించిన ఆరో ఆట‌గాడిగా కూడా అట్కిన్స‌న్ రికార్డుల‌కెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్స‌న్‌తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్‌,  క్రిస్ వోక్స్ ఉన్నారు.

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)