ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్‌ తుది జట్టు ఇదే! స్టార్‌ క్రికెటర్‌ వచ్చేశాడు

Published on Wed, 05/31/2023 - 11:38

లార్డ్స్‌ వేదికగా జూన్‌1నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్‌  తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది.  ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్‌ పేసర్లు క్రిస్‌వోక్స్‌,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్‌ అండర్సన్‌ ఫిట్‌నెస్‌ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్‌ జోష్ టంగ్ ఇంగ్లండ్‌ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.

కాగా ఈ టెస్టుకు తొలుత  15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో  జోష్ టంగ్‌కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్‌ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ  వోర్సెస్టర్‌షైర్‌ పేసర్‌. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్‌స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే.
ఐర్లాండ్‌తో టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్
చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్‌!

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)