Breaking News

SL vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

Published on Fri, 01/23/2026 - 03:40

కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 

కుశాల్‌ మెండిస్‌ (117 బంతుల్లో 93 నాటౌట్‌; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్‌ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్‌ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్‌ అసలంక (17), దునిత్‌ వెల్లలాగె (25 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 

కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (6), జాక్‌ క్రాలీ (6), జోస్‌ బట్లర్‌ (19), సామ్‌ కరన్‌ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్‌ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రేహాన్‌ అహ్మద్‌ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్‌ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన దునిత్‌ వెల్లలాగెకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)