Breaking News

భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Published on Thu, 02/22/2024 - 13:36

రాంఛీ వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్‌ సిద్దమవుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి23) నుంచి ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని స్టోక్స్‌ సేన భావిస్తుంది. ఈ క్రమంలో రాంఛీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్‌ ఇంగ్లండ్‌ ప్రకటించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.

మూడో టెస్టులో దారుణంగా విఫలమైన మార్క్‌ వుడ్‌, రెహన్‌ ఆహ్మద్‌పై మెనెజ్‌మెంట్‌ వేటు వేసింది. వుడ్‌ స్ధానంలో స్టార్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్‌, ఆహ్మద్‌ ప్లేస్‌లో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ జట్టులోకి వచ్చారు. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్‌ స్టోకు మరో అవకాశమిచ్చారు.

మరోవైపు భారత్‌ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్ధానంలో ముఖేష్‌ కుమార్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.

ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ ⁠డకెట్, ఒల్లీ ⁠పోప్, జో రూట్, జానీ ⁠బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ⁠ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), టామ్‌ ⁠హార్ట్‌లీ, ఒల్లీ ⁠రాబిన్‌సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)