Breaking News

రాణించిన రషీద్‌, ఓవర్టన్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఐర్లాండ్‌

Published on Sun, 09/21/2025 - 19:54

డబ్లిన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 21) జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. 

ఇంగ్లండ్‌ బౌలర్లు ఆదిల్‌ రషీద్‌ (4-0-29-3), జేమీ ఓవర్టన్‌ (4-0-17-2), లియామ్‌ డాసన్‌ (2-0-9-2) అద్బుతంగా బౌలింగ్‌ చేసి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. రెహాన్‌ అహ్మద్‌ (3-0-24-1) కూడా పర్వాలేదనిపించాడు.

ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్‌ చేయలేకపోయారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గెరాత్‌ డెలానీ (29 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల కారణంగా ఐర్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాస్‌ అదైర్‌ (33), హ్యారీ టెక్టార్‌ (28), బెంజమిన్‌ కాలిట్జ్‌ (22) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (7), లోర్కాన్‌ టక్కర్‌ (1), కర్టిస్‌ క్యాంపర్‌ (2), బ్యారీ మెక్‌కార్తీ (0), మాథ్యూ హంఫ్రేస్‌ (7) నిరాశపరిచారు.

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలువగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే సిరీస్‌ వారి వశం అవుతుంది. ఐర్లాండ్‌ గెలిస్తే సిరీస్‌ సమం అవుతుంది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు