Breaking News

బెట్టింగ్‌ కేసులో ఇంగ్లండ్‌ బౌలర్‌పై నిషేధం

Published on Sat, 06/01/2024 - 09:18

ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ నిషేధాన్ని ఎదుర్కోనున్నాడు. 2017-2019 మధ్యలో బెట్టింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో కార్స్‌పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) 16 నెలల నిషేధాన్ని విధించింది. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్‌  తాను పాల్గొన్న మ్యాచ్‌ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌లపై బెట్టింగ్‌ కాసాడని క్రికెట్‌ రెగ్యులేటర్‌ ఏసీబీ విచారణలో తేలింది. 

బెట్టింగ్‌ కాసిన విషయాన్ని కార్స్‌ కూడా అంగీకరించాడు. 16 నెలల్లో 13 నెలల నిషేధం రెండేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంటుందని ఈసీబీ తెలిపింది. ప్రస్తుతానికి కార్స్‌పై మూడు నెలల నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్‌ 28 వరకు కార్స్‌ క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో అయినా పాల్గొనేందుకు అనర్హుడు.

రాబోయే రెండేళ్లలో అతను అవినీతి నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే మిగిలిన 13 నెలల నిషేధం అమల్లోకి రాదు. కార్స్‌పై 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2016లో డర్హమ్‌ కౌంటీలో అరంగేట్రం చేసిన కార్స్‌.. 2021 నుంచి ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కార్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన కార్స్‌ ఇటీవలికాలంలో ఇంగ్లండ్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారాడు. కార్స్‌ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగల సమర్ధుడు.

ఇదిలా ఉంటే, నేటి నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జూన్‌ 4న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. బార్బడోస్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్‌.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్‌.. ఆసీస్‌తో కలిసి గ్రూప్‌-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌ ఇతర జట్లుగా ఉన్నాయి. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)