Breaking News

‘గర్వం తలకెక్కింది.. అందుకే అందరు ఓడిపోవాలనే కోరుకున్నారు’

Published on Fri, 02/28/2025 - 12:34

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాటర్‌ మార్క్‌ బుచర్‌(Mark Butcher) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్వ తలకెక్కితే ఇలాంటి చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆటపై కాస్త దృష్టి పెట్టాలంటూ హితవు పలికాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023(ICC ODI World Cup)లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్‌.. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ తీవ్రంగా నిరాశపరిచింది.

సెమీస్‌ కూడా చేరకుండానే
గ్రూప్‌-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌ జట్ల చేతిలో ఓడి కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం కష్టపడినా ఇంగ్లండ్‌ గెలిచేదే. ముఖ్యంగా అఫ్గన్‌తో మ్యాచ్‌లో జో రూట్‌(120)కు ఒక్కరు సహకారం అందించినా బట్లర్‌ బృందం గట్టెక్కేదే. కానీ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఇక ఈ వన్డే టోర్నీకి ముందు భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1తో ఓడింది. అదే విధంగా సిరీస్‌లో రోహిత్‌ సేన చేతిలో వన్డే 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. 

ఈ నేపథ్యంలో నాడు ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ మాట్లాడుతూ.. వైట్‌వాష్‌ పరాజయాన్ని తాము లెక్కచేయమని.. చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, అది జరగదని ఇప్పటికే తేలిపోయింది.

గర్వం తలకెక్కింది
ఈ నేపథ్యంలో మార్క్‌ బుచర్‌ విజ్డన్‌తో మాట్లాడుతూ.. బట్లర్‌ బృందం తీరుపై మండిపడ్డాడు. ఆటగాళ్ల గర్వం, నిర్లక్ష్య ధోరణి వల్లే... ప్రతి ఒక్కరు ఇంగ్లండ్‌ జట్టు ఓడిపోవాలని కోరుకున్నారని.. ఇకనైనా దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆటగాళ్లకు సూచించాడు. ‘‘చాలా మంది అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలుసు.

ఇంగ్లండ్‌ జట్టుకు గర్వం తలకెక్కింది. వన్డే ఫార్మాట్‌ అంటే బొత్తిగా లెక్కలేదు. వన్డే వరల్డ్‌కప్‌(2019) గెలవడానికి ఎంత కష్టపడ్డారో మరచిపోయారు. గెలిచిన తర్వాత ఇకపై ఆడటం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అహంభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఈ చేదు అనుభవాలు.

ప్రతి ఒక్కరు ఇంగ్లండ్‌ ఓడిపోవాలనే కోరుకున్నారు
మైదానంలో ఉన్న అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ జట్ల అభిమానులే కాదు.. ప్రతి ఒక్కరు ఇంగ్లండ్‌ ఓడిపోవాలని కోరుకుంది ఇందుకే. ప్రతిసారీ ఆటతో అలరిస్తామని చెబితే సరిపోదు. మ్యాచ్‌లు కూడా గెలవాలి’’ అంటూ మార్క్‌ బుచర్‌ బట్లర్‌ బృందానికి చురకలు అంటించాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 నుంచి ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడిన ఇంగ్లండ్‌ పన్నెండింట ఓడిపోవడం గమనార్హం. ఇక బ్రెండన్‌ మెకల్లమ్‌ వన్డే, టీ20 జట్ల హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశలోనే నిష్క్రమించడంతో విమర్శలు తారస్థాయికి చేరాడు.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్‌ జట్టు
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రెహాన్‌ అహ్మద్‌, సకీబ్‌ మహమూద్‌, టామ్‌ బాంటన్‌, గస్‌ అట్కిన్సన్‌.

చదవండి: CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్‌ కెప్టెన్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)