సౌతాఫ్రికాతో మూడో వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయ‌ర్‌కు చోటు

Published on Sat, 09/06/2025 - 21:29

సౌతాఫ్రికాతో ఇప్ప‌టికే మూడు వ‌న్డేల‌ సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖ‌రి మ్యాచ్‌కు సిద్ద‌మైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి త‌ప్పించుకోవాల‌ని ఇంగ్లండ్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో మూడో వ‌న్డేకు త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఇంగ్లండ్ క్రికెట్ శ‌నివారం ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ త‌మ తుది జ‌ట్టులో కేవ‌లం ఒకే ఒక మార్పు చేసింది. పేస‌ర్ సాకిబ్ మ‌హ‌మూద్ స్దానంలో బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ జామీ ఓవర్టన్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

ఓవ‌ర్ట‌న్ ఇటీవ‌లే రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తొలి రెండు వ‌న్డేల్లో విఫ‌ల‌మైన బెన్ డ‌కెట్‌ను మూడో వ‌న్డేకు కొన‌సాగించారు. అయితే డ‌కెట్‌కు ప్రోటీస్‌తో టీ20ల నుంచి మాత్రం సెల‌క్ట‌ర్లు తప్పించారు. గ‌త కొంత‌కాలంగా అవిరామంగా  క్రికెట్ ఆడుతుండ‌డంతో అత‌డికి విశ్రాంతి ఇచ్చారు. 

కాగా తొలి వన్డేలో సఫారీల చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్‌.. అనంతరం రెండో వన్డేలో పోరాడి ఓడింది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌ వన్డే ప్రపంచకప్‌-2027​కు నేరుగా ఆర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు తదుపరి వన్డే మ్యాచ్‌లు చాలా కీలకంగా మారనున్నాయి.

మూడో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టు
జేమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్‌), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)