Breaking News

ENG VS IND 5th Test: రికార్డు తిరగరాసిన టీమిండియా

Published on Fri, 08/01/2025 - 18:44

ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా ఓ రికార్డును తిరగరాసింది. ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగుల విభాగంలో భారత్‌ తమ పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది. 1978-79 వెస్టిండీస్‌ సిరీస్‌లో భారత్‌ ఆరు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ఓ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే.

ప్రస్తుత సిరీస్‌తో టీమిండియా తమ పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత్‌ ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు పాత రికార్డును చెరిపేసింది. తొలి రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ స్కోర్‌తో ఈ సిరీస్‌లో భారత్‌ పరుగుల సంఖ్య 3393 పరుగులకు చేరింది.

ఈ సిరీస్‌ మొత్తంలో భారత్‌ చేసిన ఈ పరుగులు 1995 నుంచి ఓ సిరీస్‌లో ఓ జట్టుచే చేయబడిన అత్యధిక పరుగులు కూడా కావడం మరో విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 204/6 స్కోర్‌ వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. సెషన్‌ ప్రారంభమైన గంటలోపే 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు కరుణ్‌ నాయర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.

ఇవాల్టి ఆటలో అట్కిన్సన్‌ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్‌, సిరాజ్‌, ప్రసిద్ద్‌) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్‌ బోల్తా కొట్టించాడు.

ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. అట్కిన్సన్‌కు జోష్‌ టంగ్‌ (16-4-57-3), క్రిస్‌ వోక్స్‌ (14-1-46-1) సహకరించారు.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 2, కేఎల్‌ రాహుల్‌ 14, సాయి సుదర్శన్‌ 38, శుభ్‌మన్‌ గిల్‌ 21, కరుణ్‌ నాయర్‌ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్‌ జురెల్‌ 19, వాషింగ్టన్‌ సుందర్‌ 26, సిరాజ్‌, ప్రసిద్ద్‌ డకౌట్‌ అయ్యారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జాక్‌ క్రాలే (64), బెన్‌ డకెట్‌ (43) ఔట్‌ కాగా.. ఓలీ పోప్‌ (18), జో రూట్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)