Breaking News

పాంటింగ్‌నూ దాటేసిన రూట్‌.. మిగిలింది సచిన్‌ ఒక్కడే

Published on Fri, 07/25/2025 - 20:20

మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్‌.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఈ స్కోర్‌ వద్ద రూట్‌ సచిన్‌ తర్వాత టెస్ట్‌ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే రాహుల్‌ ద్రవిడ్‌, జాక్‌ కల్లిస్‌, రికీ పాంటింగ్‌ను దాటేయడం విశేషం. 

ఇక రూట్‌ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్‌ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 15921
జో రూట్‌- 13380*
రికీ పాంటింగ్‌- 13378
జాక్‌ కల్లిస్‌- 13289
రాహుల్‌ ద్రవిడ్‌- 13288

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 433/4గా ఉంది. రూట్‌ 121, స్టోక్స్‌ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94), ఓలీ పోప్‌ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్‌ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 2, అన్షుల్‌ కంబోజ్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.  

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)