Breaking News

ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌ ఓపెనర్లు

Published on Thu, 07/24/2025 - 20:30

మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్‌ డకెట్‌ 43, జాక్‌ క్రాలే 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ సెషన్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్‌ దక్కలేదు. 

బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ తలో 5, సిరాజ్‌ 4 ఓవర్లు వేయగా.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు వన్డేలను తలపించి ఆడారు. ప్రస్తుతం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 281 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్‌ బౌలర్‌ బెన్‌ స్టోక్స్‌ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)