Breaking News

ENG VS IND 4th Test: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. మైదానాన్ని వీడిన పంత్‌

Published on Wed, 07/23/2025 - 22:20

83 ఓవర్ల తర్వాత టీమిండియా బ్యాటర్‌ శార్ధుల్‌ ఠాకూర్‌ 19, జడేజా 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి స్కోర్‌ 264 పరుగులుగా ఉంది.

మాంచెస్టర్‌ టెస్ట్‌లో టీమిండియాకు తొలి రోజు చివరి సెషన్‌లో ఊహించని ఎదురుదెబ్బ​ తగిలింది. మూడో టెస్ట్‌లో వేలి గాయానికి గురైన పంత్‌ తాజాగా కాలి బొటన వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన పంత్‌ను వాహనంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. పంత్‌ (37) మైదానాన్ని వీడే సమయానికి ఓ చారిత్రక రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి పర్యాటక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును పంత్‌ సిక్సర్‌తో అందుకోవడం​ విశేషం.

పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. పంత్‌ మైదానాన్ని వీడిన కొద్ది సేపటికే సాయి సుదర్శన్‌ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 78 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 249 పరుగులుగా ఉంది. సాయి సుదర్శన్‌ (61), రవీంద్ర జడేజా (12) క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (46), యశస్వి జైస్వాల్‌ (58) రాణించగా.. శుభ్‌మన్‌ గిల్‌ (12) నిరాశపరిచాడు. భారత్‌ కోల్పోయిన వికెట్లలో రాహుల్‌ వికెట్‌ క్రిస్‌ వోక్స్‌కు.. జైస్వాల్‌ వికెట్‌ లియామ్‌ డాసన్‌కు.. శుభ్‌మన్‌ గిల్‌ వికెట్‌ బెన్‌ స్టోక్స్‌కు దక్కింది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. భారత్‌ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ భారత్‌కు డు ఆర్‌ డైగా మారింది.

తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, ⁠ ⁠బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, ⁠హ్యారీ బ్రూక్,⁠ బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, ⁠క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే,  జోఫ్రా ఆర్చర్.

భారత్‌: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్‌, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)