Breaking News

ENG VS IND 3rd Test: అదే జరిగితే టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్‌ చేయాలి..!

Published on Fri, 07/11/2025 - 11:39

లార్డ్స్‌ టెస్ట్‌ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గాయపడిన విషయం తెలిసిందే.  ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవ‌ర్ వేసిన జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్ర‌మంలో పంత్ ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయ‌మైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్ర‌మైన నొప్పితో విలవిలలాడాడు.

ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్‌స్టిట్యూట్‌ వికెట్ కీప‌ర్‌గా దృవ్ జురెల్ మైదానంలోకి వ‌చ్చాడు. పంత్‌ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్‌లో పంత్‌ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.

రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్‌ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్‌ మ్యాచ్‌లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ​ పంత్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.

ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్‌ లేదా వికెట్‌కీపింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌ చేయడానికి వీలు ఉండదు. 

ఈ లెక్కన పంత్‌ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్‌ 10 మందితోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న పంత్‌ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ సిరీస్‌లో పంత్‌ కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 342 పరుగులు చేసి గిల్‌ తర్వాత ఈ సిరీస్‌లో సెకెండ్‌ హయ్యెస్ట్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న పంత్‌ బ్యాటింగ్‌కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్‌ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 18, బెన్‌ డకెట్‌ 23, ఓలీ పోప్‌ 44, హ్యారీ బ్రూక్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్‌ కుమార్‌ రె​డ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్‌ జడేజా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది.

 

 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)