Breaking News

సిరాజ్‌ అత్యుత్సాహం.. కొట్టేస్తావా ఏంటి..?

Published on Sun, 07/13/2025 - 16:41

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ అద్భుతమైన బంతితో బెన్‌ డకెట్‌ను (12) బోల్తా కొట్టించాడు. పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో డకెట్‌ బుమ్రాకు సునాయాసమైన క్యాచ్‌ అందించాడు.

డకెట్‌ను ఔట్‌ చేశాక సిరాజ్‌ పట్టలేని ఆనందంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. డకెట్‌వైపు కోపంగా చూస్తూ పెవిలియన్‌వైపు అడుగులేస్తున్న అతన్ని భుజంతో ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సిరాజ్‌ ప్రవర్తనపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అంత ఓవరాక్షన్‌ అవసరం లేదని అక్షింతలు వేస్తున్నారు.  కొట్టేస్తావా ఏంటని ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ మూడో రోజు చివర్లో కూడా ఇదే తరహా ప్రదర్శనతో నెటిజన్లచే చివాట్లు తిన్నాడు. మూడో రోజు ఆట ముగియ‌డానికి ఆరు నిమిషాలు ఉండ‌గా.. ఇంగ్లండ్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.

ఈ స‌మ‌యంలో భార‌త్ క‌నీసం రెండు ఓవ‌ర్లు అయినా బౌలింగ్ చేయాల‌ని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెన‌ర్లు మాత్రం ఒక్క ఓవ‌ర్ ఆడి మూడో రోజు ఆట‌ను ముగించాల‌ని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ ప‌దేప‌దే అంతరాయం క‌లిగించి స‌మ‌యాన్ని వృథా చేశాడు.

ఈ క్ర‌మంలో స‌హ‌నం కోల్పోయిన గిల్‌.. క్రాలీని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్‌కు తోడుగా సిరాజ్ కూడా సీన్‌లోకి కావడంతో కాసేపు ఫీల్డ్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ త‌ర్వాత అంపైర్‌లు జోక్యంతో చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్ద‌మణిగింది. గిల్‌, సిరాజ్‌ ప్రవర్తనను క్రికెట్‌ అభిమానులు తప్పుబడుతున్నారు. ఇంత ఓవరాక్షన్‌ అవసరం లేదని హితవు పలుకుతున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండు వికెట్లు సిరాజే తీసుకున్నాడు. తొలుత డకెట్‌ను ఔట్‌ చేసిన సిరాజ్‌, ఆతర్వాత ఓలీ పోప్‌ను (4) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌ 42/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్‌ (387) చేసిన విషయం తెలిసిందే.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ రూట్‌ (104) సెంచరీ, జేమీ స్మిత్‌ (51), బ్రైడన్‌ కార్స్‌ (56) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ 387 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ కేఎల్‌ రాహుల్‌ (100) సెంచరీ, పంత్‌ (74), జడేజా (72) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్‌ చేసిన 387 పరుగుల వద్దనే ఆలౌటైంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)