Breaking News

యాషెస్‌ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..

Published on Sat, 07/29/2023 - 15:28

England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌ యాషెస్‌ సిరీస్‌లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్‌ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది.

లబుషేన్‌ జిడ్డు బ్యాటింగ్‌
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా...  ఇంగ్లండ్‌ 283 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా(47), డేవిడ్‌ వార్నర్‌(24) ఫర్వాలేదనిపించారు. 

అయితే, క్రిస్‌వోక్స్‌ బౌలింగ్‌లో వార్నర్‌ పెవిలియన్‌ చేరిన క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. 

రన్‌రేటు 1.61..
ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి  లబుషేన్‌ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్‌నర్‌షిప్‌లో రన్‌రేటు 1.61గా నమోదైంది. 

వారి రికార్డు బద్దలు కొట్టి
యాషెస్‌ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్‌రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మైకేల్‌ కార్బెర్రి, జోరూట్‌ 1.75 రన్‌రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు.

ఖవాజా, లబుషేన్‌ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్‌రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్‌లను ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్‌ స్మిత్‌ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్‌.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్‌! వీడియో వైరల్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)