Breaking News

ఇలవేనిల్‌కు స్వర్ణ పతకం

Published on Sat, 08/23/2025 - 00:38

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలో శుక్రవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తమిళనాడుకు చెందిన ఇలవేనిల్‌ వలారివన్‌ భారత్‌కు పసిడి పతకాన్ని... ఇలవేనిల్, మెహులీ ఘోష్, అనన్య నాయుడులతో కూడిన బృందం కాంస్య పతకాన్ని అందించింది. స్కీట్‌ మిక్స్‌డ్‌ విభాగంలో గనీమత్‌ సెఖోన్‌–అభయ్‌ సింగ్‌ సెఖోన్‌ జోడీ భారత్‌ ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత ఫైనల్లో 26 ఏళ్ల ఇలవేనిల్‌ 253.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 

ఈ క్రమంలో ఇలవేనిల్‌ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. 2019 నుంచి అపూర్వీ చండేలా (భారత్‌; 252.9 పాయింట్లు) పేరిట ఉన్న ఆసియా రికార్డును ఇలవేనిల్‌ సవరించింది. భారత్‌కే చెందిన మెహులీ ఘోష్‌ 208.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. టీమ్‌ విభాగంలో ఇలవేనిల్‌ (630.7 పాయింట్లు), మెహులీ (630.3 పాయింట్లు), అనన్య (630 పాయింట్లు) మొత్తం 1891 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 

స్కీట్‌ మిక్స్‌డ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో గనీమత్‌–అభయ్‌ ద్వయం 39–37తో అబ్దుల్లా అల్‌రషీది–అఫ్రా (కువైట్‌) జంటపై  నెగ్గింది.   మరోవైపు మహిళల జూనియర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో శాంభవి, హృదయశ్రీ, ఇషాలతో కూడిన భారత జట్టు 1896.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో హర్‌మెహర్‌ సింగ్‌–యశస్వి రాథోడ్‌ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)