Breaking News

ఇషా సింగ్‌ రజత గురి

Published on Sun, 04/06/2025 - 04:08

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్‌ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్‌ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్‌ జియాన్‌ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. 

ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌’ మనూ భాకర్‌ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్‌ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించారు.  

మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌లో భారత షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్‌ ప్రారంభ ప్రపంచకప్‌ ఈవెంట్‌లో భారత్‌ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 

అనిట మంగోల్డ్‌ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్‌; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్‌ కౌర్‌కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్‌ అనిట మంగోల్డ్‌ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్‌ కౌర్‌ ఆ తర్వాత అదరగొట్టింది. 

నీలింగ్‌ పొజిషన్‌లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్‌... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్‌ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో సిఫ్ట్‌ కౌర్‌ 590 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)