Breaking News

‘పటౌడీ  ట్రోఫీ’కి  మంగళం!

Published on Tue, 04/01/2025 - 04:54

లండన్‌: ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్‌ అలీఖాన్‌ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. అయితే ‘పటౌడీ ట్రోఫీ’కి గుడ్‌బై చెప్పాలని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన నుంచి దీనిని అమలు చేయాలనే ఆలోచనలో ఈసీబీ ఉందని సమాచారం.

 ‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం పాడేందుకు కచ్చితమైన కారణాన్ని ఈసీబీ ఇంకా వెల్లడించకపోయినా... ‘పటౌడీ’ పేరు బదులుగా రెండు దేశాల నుంచి ఇద్దరు దిగ్గజాల పేరుతో సరికొత్త ట్రోఫీ తెరపైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ‘పటౌడీ ట్రోఫీ’కి ముగింపు పలికే విషయంపై ఈసీబీ అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ‘పటౌడీ ట్రోఫీ’ మార్పు ఉండదని చెప్పడంలేదు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు.

 ‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది. ‘కొంతకాలం తర్వాత ఆయా వ్యక్తుల పేర్లతో నిర్వహించే ట్రోఫీలకు ముగింపు పలకడం సహజం’ అని పటౌడీ కుటుంటానికి సన్నిహితులు వ్యాఖ్యానించడం గమనార్హం. క్రికెట్‌లో ‘ట్రోఫీ’లు రిటైర్‌ కావడం సహజమే. 

గతంలో ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య ‘విజ్డెన్‌ ట్రోఫీ’తో సిరీస్‌లు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘విజ్డెన్‌ ట్రోఫీ’కి రిటైర్మెంట్‌ ఇచ్చేసి దాని బదులుగా రెండు జట్ల మధ్య ‘రిచర్డ్స్‌–బోథమ్‌ ట్రోఫీ’తో సిరీస్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల మధ్య నాలుగు ట్రోఫీల టెస్టు సిరీస్‌లు నిర్వహిస్తున్నారు. 

భారత్‌–ఆ్రస్టేలియా జట్ల మధ్య 1996 నుంచి ‘బోర్డర్‌–గావాస్కర్‌ ట్రోఫీ’... వెస్టిండీస్‌–ఆస్ట్రేలియా జట్ల మధ్య 1960 నుంచి ‘ఫ్రాంక్‌ వోరెల్‌ ట్రోఫీ’... ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య 2007 నుంచి ‘వార్న్‌–మురళీథరన్‌ ట్రోఫీ’... న్యూజిలాండ్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య 2024 నుంచి ‘క్రో–థోర్ప్‌ ట్రోఫీ’లను నిర్వహిస్తున్నారు.  ఇంగ్లండ్‌ పర్యటన సమయంలో భారత్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ 2007 నుంచి ‘పటౌడీ ట్రోఫీ’తో జరుగుతోంది. భారత్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను 1951 నుంచి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ‘ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ’ పేరుతో నిర్వహిస్తున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)