Breaking News

విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు క్షమాపణ

Published on Tue, 06/27/2023 - 18:18

క్రికెట్‌ ప్రపంచాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) క్షమాపణ కోరడం ఆసక్తి కలిగించింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతీ బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ సోమవారం రాత్రి ఈసీబీ లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్‌ కమీషన్‌ ఫర్‌ ఈక్విటీ ఇన్‌ క్రికెట్‌(ICEC) నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ రిపోర్టులో వివక్ష వల్ల ఎదుర్కొన్న దుష్ప్రవర్తనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మార్పులకు సంబంధించి 44 ప్రతిపాదనలను ఐసీఈసీ రిపోర్టులో పొందుపరిచింది.

నివేదిక ప్రకారం.. '' ఇంగ్లండ్‌ క్రికెట్‌లో వివక్ష జరిగిన మాట నిజమే. బ్లాక్‌లైవ్‌ మ్యాటర్స్‌, మీటూ తరహాలో ఇక్కడా నల్లవారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 85 శాతం భారత సంతతికి చెందిన బాధితులే ఉండడం గమనార్హం. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగవివక్ష-వర్గ-ఆధారిత వివక్ష నుంచి విముక్తి పొందలేకపోయారు.'' అంటూ ఐసీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. కాగా రిపోర్టును పరిశీలించిన ఈసీబీ తప్పుకు క్షమాపణ కోరుతూ తక్షణమే మార్పులు చేపడతామని తెలిపింది.

''క్రికెట్‌ అనేది అందరి గేమ్‌. ఇక్కడ వివక్షకు తావులేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా త్వరలోనే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఐసీఈసీ పేర్కొన్న విధంగా జాతి వివక్ష పేరుతో మహిళలకు, నల్ల జాతీయులకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదు. అందుకు క్షమాపణ కోరుతున్నాం. ఇలాంటివి ఉపేక్షించం. ఐసీఈసీ పేర్కొన్న 44 రికమెండేషన్స్‌ను పరిశీలించాం. వచ్చే మూడు నెలల్లో  ICEC ప్రతిపాదించిన 44 సిఫార్సులకు ఒక బలమైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తాం.'' అంటూ ఈసీబీ చైర్మన్‌ రిచర్డ్‌ థాంప్సన్‌ పేర్కొన్నారు.

చదవండి: #RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం'

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి