Breaking News

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్‌ జట్లకు షాక్‌

Published on Tue, 04/30/2024 - 16:30

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఐపీఎల్‌లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్‌ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్‌లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్‌ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

పాక్‌తో ఇంగ్లండ్‌ సిరీస్‌ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్‌తో సిరీస్‌ కోసమని ఐపీఎల్‌కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్‌ తగిలినట్లే.

టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

ఐపీఎల్‌ 2024లో వివిధ​ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ జట్టు సభ్యులు..
జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)
మొయిన్‌ అలీ (సీఎస్‌కే)
బెయిర్‌స్టో (పంజాబ్‌)
సామ్‌ కర్రన్‌ (పంజాబ్‌)
లివింగ్‌స్టోన్‌ (పంజాబ్‌)
విల్‌ జాక్స్‌ (ఆర్సీబీ)
ఫిల్‌ సాల్ట్‌ (కేకేఆర్‌)
రీస్‌ టాప్లే (ఆర్సీబీ)

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌..
మే 21: క్వాలిఫయర్‌-1
మే 22: ఎలిమినేటర్‌
మే 24: క్వాలిఫయర్‌-2
మే 26: ఫైనల్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)