టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! స్టార్ ప్లేయ‌ర్ రీ ఎంట్రీ

Published on Sat, 06/14/2025 - 13:15

భార‌త మ‌హిళ‌ల‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 14 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు నాట్ స్కివ‌ర్ బ్రంట్ సార‌థ్యం వ‌హించ‌నుంది. ఇక క్రికెట్ నుంచి త‌త్కాలిక విరామం తీసుకున్న స్టార్ స్పిన్న‌ర్ సోఫీ ఎక్లెస్టోన్ తిరిగి జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేసింది. 

గ‌త నెల‌లో స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో మ‌హిళ‌ల‌తో జ‌రిగిన వైట్‌బాల్ సిరీస్‌ల‌కు ఎక్లెస్టోన్ దూరంగా ఉంది. మాన‌సిక ఒత్త‌డి కార‌ణంగా కొన్ని రోజుల పాటు ఆట‌కు దూరంగా ఉండాల‌ని సోఫీ నిర్ణ‌యించుకుంది. కానీ ఇప్పుడు టీమిండియా సిరీస్ నేప‌థ్యంలో స్టార్ స్పిన్న‌ర్ త‌న మ‌న‌సును మార్చుకుంది. 

ఎక్లెస్టోన్ రాక‌తో మ‌రో స్పిన్న‌ర్ సారా గ్లెన్ జ‌ట్టులో చోటు కోల్పోయింది. అదేవిధంగా గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20లో గాయపడిన మాజీ కెప్టెన్ హీథర్ నైట్ ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సిరీస్‌కు ఆమె దూరంగా ఉండ‌నుంది.

ఈ టీ20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్ త‌ర్వాత భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ జ‌ర‌గ‌నుంది.  మ‌రోవైస భార‌త పురుష‌ల జ‌ట్టు కూడా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. టీమిండియా ఆతిథ్య జ‌ట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

భార‌త్‌తో టీ20ల‌కు ఇంగ్లండ్ జ‌ట్టు
నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్‌), ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్

ఇంగ్లండ్‌తో టీ20ల‌కు భార‌త జ‌ట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్టికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, సరణ్య గఢావ్, క్రాంతి గఢ్‌వ్ రెడ్డి

భారత వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారెడ్, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)