50 ఓవర్ల ఫార్మాట్‌లో భారీ స్కోర్‌.. ఇంగ్లండ్‌ 498 పరుగులు చేస్తే..!

Published on Sat, 08/05/2023 - 15:37

50 ఓవర్ల క్రికెట్‌ ఫార్మట్‌లో (లిస్ట్‌-ఏ క్రికెట్‌) భారీ స్కోర్‌ నమోదైంది. ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే కప్‌-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌ జట్టు 427 పరుగులు స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ అలెక్స్‌ లీస్‌ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్హమ్‌ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్‌ గ్రహం క్లార్క్‌ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు.

ఫలితంగా డర్హమ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్‌ నమోదు చేసింది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యుత్తమ టీమ్‌ స్కోర్‌ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్‌ జగదీశన్‌ (277) భారీ డబుల్‌ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్‌ (154) శతకంతో మెరిశాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. గతేడాది జూన్‌ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 498 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. నాడు ఇంగ్లీష్‌ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్‌ సాల్ట్‌ (122), డేవిడ్‌ మలాన్‌ (125), జోస్‌ బట్లర్‌ (162 నాటౌట్‌) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు. 

ఇక ససెక్స్‌-డర్హమ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్‌ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ టామ్‌ హెయిన్స్‌ (65), ప్రెంటిస్‌ (65) అర్ధసెంచరీలతో రాణించారు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)