Breaking News

ఐసీసీ అవార్డుల‌లో స‌త్తాచాటిన శ్రీలంక ప్లేయ‌ర్స్..

Published on Mon, 09/16/2024 - 16:20

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష‌, మ‌హిళ క్రికెట‌ర్ల‌కు 'ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మంత్‌' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.

పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్  వెల్లలాగే, మహిళల క్రికెట్‌ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ  ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.

అదరగొట్టిన దునీత్‌..
గత నెలలో స్వదేశంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. 

అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. 

ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు  లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.
చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్‌.. లేకుంటే కష్టమే: యూనిస్‌ ఖాన్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)